Share News

ఇరిగేషన్‌ శాఖలోకి 677 మంది ఏఈఈలు

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:00 AM

ఇరిగేషన్‌ శాఖలో కొత్తగా 677 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ)లు కొలువుల్లో చేరనున్నారు. వీరి ఎంపిక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్‌

ఇరిగేషన్‌ శాఖలోకి 677 మంది ఏఈఈలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ శాఖలో కొత్తగా 677 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ)లు కొలువుల్లో చేరనున్నారు. వీరి ఎంపిక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఇటీవలే పూర్తి చేసింది. ఏఈఈలుగా ఎంపికైన వారిలో 10 మంది ఐఐటీ పట్టభద్రులతో పాటు ఐఐటీల్లో పీజీ చేసిన 21 మంది, ఎన్‌ఐటీలో డిగ్రీ చేసిన 50 మందితో పాటు పీజీ చేసిన 33 మంది కలిపి మొత్తం 677 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు జలసౌధ భవన ంలో జరిగే కార్యక్రమంలో 677 మంది ఏఈఈలకు సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. మరోవైపు కాలువలు, చెరువులను నిరంతరం పరిశీలించి, నీటి విడుదలతో పాటు వాటి పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు చూడడానికి వీలుగా 1800 మంది లష్కర్ల నియామకాలపైనా సీఎం ప్రకటన చేయనున్నారు. లష్కర్లు లేకపోవడం వల్లే కాలువలు, చెరువులు భారీగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో 1800 మంది లష్కర్లను గౌరవ వేతనంతో నియమించనున్నారు. కాగా, ఏఈఈలుగా ఎంపికైన అభ్యర్థులంతా ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు జలసౌధ కార్యాలయానికి చేరుకోవాలని ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌ కోరారు. ఇక ఎస్టీ కేటగిరీలో 50 మంది (లంబాడాలు) ఎంపికయ్యారు. వీరంతా కులధ్రువీకరణకు సంబంధించిన ప్రొఫార్మాను 26వ తేదీ సాయంత్రంలోగా సమర్పించాలని, అలా సమర్పించని అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే ప్రసక్తే లేదని యన స్పష్టం చేశారు.

Updated Date - Sep 25 , 2024 | 04:00 AM