మహీంద్ర వర్సిటీకి ఐదేళ్లలో 500 కోట్లు
ABN , Publish Date - Mar 27 , 2024 | 04:52 AM
హైదరాబాద్‌లో నెలకొల్పిన మహీంద్ర యూనివర్సిటీకి రానున్న అయిదేళ్లలో రూ.500 కోట్లు ఇస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. తొలుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు
ఆనంద్ మహీంద్ర ప్రకటన
ఢిల్లీ, మార్చి 26: హైదరాబాద్‌లో నెలకొల్పిన మహీంద్ర యూనివర్సిటీకి రానున్న అయిదేళ్లలో రూ.500 కోట్లు ఇస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. తొలుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు ఇస్తామని, మిగిలింది దశల వారీగా చెల్లిస్తామని తెలిపారు. దీంతో పాటుగా ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు మరో రూ.50 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 2020లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 35 ప్రోగ్రాంలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ వర్సిటీ పరిధిలో స్కూల్‌ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, లిబరల్ ఆర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.