Share News

50 మంది ఉద్యోగులుంటే క్రెచ్‌లు ఉండాల్సిందే

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:25 AM

50 మంది లేదా అంతకుమించి ఉద్యోగులుంటే వారి పిల్లల కోసం సంరక్షణ కేంద్రాన్ని(క్రెచ్‌) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)

50 మంది ఉద్యోగులుంటే క్రెచ్‌లు ఉండాల్సిందే

ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలకు ఏఐసీటీఈ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): 50 మంది లేదా అంతకుమించి ఉద్యోగులుంటే వారి పిల్లల కోసం సంరక్షణ కేంద్రాన్ని(క్రెచ్‌) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. జాతీయ ప్రసూతి ప్రయోజనాల చట్టం మార్గదర్శకాలమేరకు తగిన ఏర్పాట్లు చే సుకోవాలని రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కళాశాలల యాజమాన్యాలకు ఏఐసీటీఈ సూచించింది. క్రెచ్‌ల ఏర్పాటుకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ రూపొందించిన సూచనలను విధిగా పాటించాలని ఇటీవల ఆయా కళాశాలల యాజ మాన్యాలకు రాసిన లేఖలో పేర్కొంది. అలాగే, అన్ని అఫిలియేటెడ్‌ కళాశాలల్లో జాతీయ ప్రసూతి ప్రయోజనాల చట్టం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని జేఎన్‌టీయూ అధికారులకు లేఖ రాసింది. అఫిలియేషన్‌ ప్రక్రియలో భాగంగా 50 మంది లేదా అంతకుమించి ఉద్యోగులున్న ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన క్రెచ్‌లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఏఐసీటీఈ రెగ్యులేషన్‌ బ్యూరో సలహదారు ఎన్‌హెచ్‌ సిద్ధ లింగస్వామి ఇటీవల రాసిన లేఖలో స్పష్టం చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 10:02 AM