Share News

పోలీసుల తనిఖీల్లో రూ.22 లక్షల నగదు సీజ్‌

ABN , Publish Date - May 03 , 2024 | 04:44 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో గురువారం రూ. 22 లక్షల నగదు పట్టుబడింది. భువనగిరి పట్టణంలో రూ.13.48లక్షలు, వలిగొండలో

పోలీసుల తనిఖీల్లో రూ.22 లక్షల నగదు సీజ్‌

భువనగిరి టౌన్‌, ఖిల్లా (నిజామాబాద్‌ ), మే 2: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో గురువారం రూ. 22 లక్షల నగదు పట్టుబడింది. భువనగిరి పట్టణంలో రూ.13.48లక్షలు, వలిగొండలో రూ.1.66 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే యాదాద్రి జాల్లా వ్యాప్తంగా 28 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 19 మంది రౌడీ షీటర్ల నుంచి బైండోవర్‌ తీసుకున్నారు. కాగా, నిజామాబాద్‌లో రూ.7.44 లక్షల నగదును పట్టుకున్నారు. నగరంలోని గంజ్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీల్లో నేతి శ్రావణ్‌ అనే వ్యక్తి వద్ద రూ.4లక్షలు లభించాయి. అలాగే శివాజీనగర్‌లో చెన్న శివకుమార్‌ అనే వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద రూ.3లక్షల 44వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 08:21 AM