Share News

సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన 1.61 కోట్లు వెనక్కి..

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:45 AM

ఒకరిని ఆశపెట్టి.. మరొకరిని భయపెట్టి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.2.2 కోట్లు కొల్లగొట్టగా.. పోలీసులు వారి ఖాతాలను ఫ్రీజ్‌ చేసి డబ్బు వెనక్కి రాబట్టారు.

సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన 1.61 కోట్లు వెనక్కి..

బాధితులకు అందించిన సిటీ, సైబర్‌ క్రైమ్‌ జాయింట్‌ సీపీ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఒకరిని ఆశపెట్టి.. మరొకరిని భయపెట్టి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.2.2 కోట్లు కొల్లగొట్టగా.. పోలీసులు వారి ఖాతాలను ఫ్రీజ్‌ చేసి డబ్బు వెనక్కి రాబట్టారు. సిటీ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఫెడెక్స్‌ పార్శిల్‌ సర్వీ్‌సలో మీ పేరుతో తైవాన్‌కు డ్రగ్స్‌ పార్శిల్‌ వెళ్తోంది. మీపై విచారణకు ఆదేశించారంటూ ముంబై క్రైమ్‌ బ్రాంచి పోలీసుల పేరుతో హైదరాబాద్‌కు చెందిన యువతికి అర్ధరాత్రి ఆగంతకులు ఫోన్‌ చేశారు. విచారణకు హాజరుకావాలని భయపెట్టి రూ.98.79 లక్షలు కొల్లగొట్టారు. మరో ఘటనలో.. ఒక గుర్తు తెలియని వ్యక్తి తానొక పెద్ద స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌నని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పినట్టు ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి, విడతలవారీగా రూ.1.04కోట్లు దోచేశాడు. ఈ రెండు కేసుల్లో సైబర్‌ నేరగాళ్ల ఖాతాలను సైబర్‌ క్రైం పోలీసులు ఫ్రీజ్‌ చేయించారు. ఆ బాధితురాలికి రూ.80,76,198, బాధితుడికి రూ.80,48,028 డీడీల రూపంలో అందజేశారు.

Updated Date - Feb 17 , 2024 | 03:45 AM