Share News

మునిసిపాలిటీలకు రూ.155 కోట్ల నిధులు

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:37 AM

పది లక్షలకన్నా తక్కువ జనాభా ఉన్న మునిసిపాలిటీలలో మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.155 కోట్లకుపైగా

మునిసిపాలిటీలకు రూ.155 కోట్ల నిధులు

815వ ఆర్థిక సంఘం నుంచి విడుదల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పది లక్షలకన్నా తక్కువ జనాభా ఉన్న మునిసిపాలిటీలలో మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.155 కోట్లకుపైగా నిధులు విడుదలయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి వాయిదా కింద రూ.94,38,38,000, రెండో వాయిదా కింద రూ.60,65,38,000 విడుదల చేశారు. ఈ నిధులను పురపాలశాఖ సంచాలకులు 10 లక్షలలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిధులతో పారిశుధ్యం, తాగునీరు, ఇతర మౌలిక వసతులకు ఆయా మునిసిపాలిటీలు ఖర్చు చేయనున్నాయి. కాగా, రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీల్లో ఉన్న కుక్కల వాస్తవ లెక్కలు తేల్చాలని పురపాలక శాఖ సంచాలకులు దివ్యా దేవరాజన్‌ ఆదేశించారు. మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా పక్కాగా వివరాలు సేకరించాలని, ఇందుకు అవసరమైతే ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Apr 30 , 2024 | 04:37 AM