104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:28 PM
04 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐ టీయూ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.

కందనూలు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐ టీయూ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల సంఘం అధ్యక్షు డు సాయిరాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులందరూ కూడా బకాయి వేతనా ల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో అనే క సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చిన నేప థ్యంలో డిసెంబరు 4న జీవో నెంబరు ఆర్‌టీ నెంబరు 706 విడుదల చేస్తూ 12కోట్ల 56లక్షల రూపాయలు విడుద ల చేసిందని, కానీ నేటి వరకు 104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేద న్నారు. దీనివల్ల 104 ఉద్యోగుల కు టుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత క ల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కా ర్యక్రమంలో యాదగిరి, చెన్నయ్య, రామకృష్ణ, శ్రీను, సురేష్, అలేఖ్య, మాజీ నాగయ్య, పరవి బాలరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.