Share News

10,342 కొత్త ఓటరు దరఖాస్తులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:36 PM

లోక్‌సభ ఎన్నికలు పురస్కరించుకుని నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో జిల్లాలో 10,342 దరఖాస్తులు వచ్చాయి.

10,342 కొత్త ఓటరు దరఖాస్తులు

ఓటరు నమోదుకు 9,332.. చిరునామా మార్పునకు 1,010 అప్లికేషన్లు

25వ తేదీలోగా పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశం

వికారాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : లోక్‌సభ ఎన్నికలు పురస్కరించుకుని నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో జిల్లాలో 10,342 దరఖాస్తులు వచ్చాయి. గత జనవరి 23 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు జిల్లాలో కొనసాగిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో మొత్తం 10,342 దరఖాస్తులు రాగా, వాటిలో కొత్త ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులు 9,332 ఉండగా, చిరునామా మార్పులకు సంబంధించి 1,010 దరఖాస్తులు ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదుకు సంబంఽధించి అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 2,698 దరఖాస్తులు రాగా, కొడంగల్‌ నియోజకవర్గంలో 2,401, పరిగి నియోజకవర్గంలో 2,392, వికారాబాద్‌ నియోజకవర్గంలో 1,841 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం-6 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 7,233 దరఖాస్తులను ఆమోదించగా, 926 దరఖాస్తులను తిరస్కరించారు. 1173 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే చిరునామా మార్పు కోసం వచ్చిన ఫారం-8 దరఖాస్తుల్లో 861 దరఖాస్తులను ఆమోదించగా, 63 దరఖాస్తులను తిరస్కరించారు. 86 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం దరఖాస్తుల్లో 8094 దరఖాస్తులను ఆమోదించగా, 989 దరఖాస్తులను తిరస్కరించారు. 1259 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు.

నియోజకవర్గాల వారీగా ...

ఓటరు నమోదు కోసం పరిగి నియోజకవర్గంలో 2392 దరఖాస్తులు రాగా, వాటిలో ఇప్పటి వరకు 2035 దరఖాస్తులు ఆమోదించగా, 92 దరఖాస్తులను తిరస్కరించారు. 265 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వికారాబాద్‌ నియోజకవర్గంలో 1841 దరఖాస్తులు రాగా, వాటిలో 1173 దరఖాస్తులను ఆమోదించగా, 297 దరఖాస్తులను తిరస్కరించగా, 371 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. తాండూరు నియోజకవర్గంలో 2698 దరఖాస్తులు రాగా, వాటిలో 2376 దరఖాస్తులను ఆమోదించగా, 40దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 282 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొడంగల్‌ నియోజకవర్గంలో 2401 దరఖాస్తులు రాగా, వాటిలో 1649 దరఖాస్తులను ఆమోదించగా, 497 దరఖాస్తులను తిరస్కరించారు. 255 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. అదే ఫారం-8 దరఖాస్తులు మొత్తం 1,010రాగా వాటిలో 861 దరఖాస్తులను ఆమోదించగా, 63దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 86 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 11:36 PM