Share News

Manchiryāla- వందశాతం ఆస్తి పన్ను పసూలు చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:47 PM

మున్సిపల్‌ పరిధిలో వందశాతం ఆస్తి పన్ను పసూలు చేయాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) రాహూల్‌ అన్నారు. నస్పూర్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు.

Manchiryāla-     వందశాతం ఆస్తి పన్ను పసూలు చేయాలి
సిబ్బందితో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహూల్‌

నస్పూర్‌, మార్చి 6: మున్సిపల్‌ పరిధిలో వందశాతం ఆస్తి పన్ను పసూలు చేయాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) రాహూల్‌ అన్నారు. నస్పూర్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్ను ఎంత వసూలు చేయాల్సి ఉన్నది, పూర్తి స్థాయిలో ఆస్తి పన్నును వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. మార్చి 31లోగా ఆస్తి పన్నును పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నూరు శాతం వన్నులు వసూలైయ్యే విధంగా ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి ప్రారంభం కానునందున వార్డుల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. తాగునీటి కొరకు ప్రజలు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలను చేపట్టాలని సూచించారు. పారిశుద్ద్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేయాలన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ నూరు శాతం పూర్తి చేయాలన్నారు. టీఎస్‌-బీపాస్‌ లో అనుమతులు ఏలా ఇస్తున్నరు, ధరఖాస్తులు చేసిన తర్వాత ఎన్ని రోజులకు అనుమతులు ఇస్తున్నరని తెలుసుకున్నారు. రెండవ విడతలో నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజా పాలన ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ పరిశీలించి ధరఖాస్తుదారులతో మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే అన్‌లైన్‌ చేయాలని అధికారులకు సూచించారు. అంతకు ముందుగా కార్యాలయానికి వచ్చిన అదనపు కలెక్టర్‌ రాహూల్‌కు చైర్మన్‌ సుర్మిళ్ళ వేణు మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ చిట్యాల సతీష్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సతీష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:47 PM