Share News

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:16 PM

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రిన్సిపాళ్లు కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి శంకర్‌ అన్నారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి శంకర్‌

జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి శంకర్‌

వికారాబాద్‌, జనవరి 12 : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రిన్సిపాళ్లు కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి శంకర్‌ అన్నారు.శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వికారాబాద్‌ జిల్లాలోని ఇంటర్మీడియట్‌ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి తెలుగు అకాడమీ పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలన్నారు. అకాడమి పుస్తకాలు చదివే విద్యార్థులే పోటీ పరీక్షలలో రాణిస్తారన్నారు. బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించాలని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే ప్రాక్టికల్‌ , థియరీ పరీక్షలకు కావాల్సిన మౌలిక వసతులలో భాగంగా ఇంటర్నెట్‌, సీసీ కెమెరాలు, ప్రింటర్‌, కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రాబోయే పబ్లిక్‌ పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్‌ కోర్సులు నిర్వహిస్తున్న అన్ని జూనియర్‌ కళాశాలలకు ఈనెల13 నుండి 16వరకు సంక్రాంతి సెలవులను తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించిందని దీనిని అన్ని కళాశాలల మెనేజ్‌మెంట్లు పాటించాలని తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 11:16 PM