Share News

Poco: రూ.6 వేలకే 5,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్స్ షురూ

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:05 PM

మీకు మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్‌ఫోన్(smartphone) కావాలా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన POCO C61 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరల్లో ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఉన్న అద్భుతమైన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Poco: రూ.6 వేలకే 5,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్స్ షురూ

మీకు మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్‌ఫోన్(smartphone) కావాలా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన Poco C61 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరల్లో ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఉన్న అద్భుతమైన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Poco C61 6.7 అంగుళాల LCD స్క్రీన్ డిస్ ప్లే, HD+ (1650 × 720 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో లభిస్తుంది.

దీనిలో MediaTek Helio G36 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 GPUను కల్గి ఉంది. ఈ ఫోన్‌లో 6GB టర్బో ర్యామ్, 64, 128 GB స్టోరేజ్ నిల్వలను కలిగి ఉండగా, మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించకునే అవకాశం కూడా ఉంది. కెమెరాలో భాగంగా వెనుక భాగంలో 8MP ఉండగా, ఫ్రంట్ కెమెరా 5MPగా ఉంది.


Poco C61 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఈ ఫోన్‌ 5000mAh బ్యాటరీతో 10W ఛార్జింగ్ USB టైప్ C పోర్ట్‌‌తో లభిస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించబడింది. కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G, Wi-Fi 5 802.11, బ్లూటూత్ 5.4, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ధర విషయానికి వస్తే Poco C61 స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్టులో రూ.6,999గా ఉంది. ఇది మార్చి 28 నుంచి ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ లో ప్రత్యేక విక్రయం మొదలైంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Meta: మెటా నుంచి బ్లాస్టింగ్ ఫీచర్.. ఏఐ ఇమేజ్‌లు ఇక వాట్సప్‌లోనే

Updated Date - Apr 23 , 2024 | 09:13 AM