Share News

రెండో టీ20లో జింబాబ్వే గెలుపు

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:23 AM

శ్రీలంకతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో జింబాబ్వే అదరగొట్టింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన వేళ టెయిలెండర్‌ బ్యాటర్లు ల్యూక్‌ జోంగ్వే

రెండో టీ20లో జింబాబ్వే గెలుపు

కొలంబో: శ్రీలంకతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో జింబాబ్వే అదరగొట్టింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన వేళ టెయిలెండర్‌ బ్యాటర్లు ల్యూక్‌ జోంగ్వే (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 నాటౌట్‌), మదండే (5 బంతుల్లో 2 సిక్సర్లతో 15 నాటౌట్‌) చెలరేగారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో గెలిచిన జింబాబ్వే సిరీస్‌లో 1-1తో నిలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 173/6 స్కోరు చేయగా.. ఛేదనలో జింబాబ్వే19.5 ఓవర్లలో 178/6 స్కోరుతో గెలిచింది. ఇర్విన్‌ (70) టాప్‌ స్కోరర్‌.

Updated Date - Jan 17 , 2024 | 03:23 AM