పాక్‌కు జింబాబ్వే షాక్
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:21 AM
సికందర్ రజా (39, 2/7) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. వర్ష ప్రభావిత తొలి వన్డేలో పాకిస్థాన్‌కు జింబాబ్వే షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల (డ/లూ పద్ధతి) తేడాతో...
బులవాయో (జింబాబ్వే): సికందర్ రజా (39, 2/7) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. వర్ష ప్రభావిత తొలి వన్డేలో పాకిస్థాన్‌కు జింబాబ్వే షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల (డ/లూ పద్ధతి) తేడాతో పాక్‌పై గెలిచింది. తొలుత జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. అనంతరం పాక్ 21 ఓవర్లలో 60/6తో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగింది. దీంతో డ/లూ పద్ధతి ప్రకారం 21 ఓవర్లకు 141 పరుగులుగా నిర్ణయించగా.. పాక్ వెనుకబడింది. కెప్టెన్ రిజ్వాన్ (19 నాటౌట్) టాప్‌స్కోరర్.