వావ్.. అశ్విన్
ABN , Publish Date - Nov 03 , 2024 | 01:37 AM
కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. మిచెల్, యంగ్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో....
కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. మిచెల్, యంగ్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో అతడి అద్భుత క్యాచ్ కివీ్‌సను దెబ్బతీసేలా చేసింది. జడేజా ఓవర్‌లో మిచెల్ ఆడిన భారీ షాట్ గాల్లోకి లేవగా.. మిడాన్ నుంచి వెనక్కి పరిగెడుతూ 38 ఏళ్ల అశ్విన్ పట్టిన ఆ డైవింగ్ క్యాచ్ అదుర్స్ అనిపించింది. మరోవైపు దీన్ని అతడి కెరీర్‌లోనే గ్రేటెస్ట్ క్యాచ్‌గా నెటిజన్లు కొనియాడారు.