Share News

వౌట్‌ లేట్‌ గోల్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:46 AM

ఫార్వర్డ్‌ వౌట్‌ వెహోస్ట్‌ చివరి నిమిషంలో చేసిన గోల్‌తో యూరో చాంపియన్‌షి్‌పలో నెదర్లాండ్స్‌ శుభారంభం అందుకుంది. గ్రూప్‌ ‘డి’లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-1తో పోలెండ్‌ను ఓడించింది...

వౌట్‌ లేట్‌ గోల్‌

పోలెండ్‌పై నెదర్లాండ్స్‌ గెలుపు

హాంబర్గ్‌ (జర్మనీ): ఫార్వర్డ్‌ వౌట్‌ వెహోస్ట్‌ చివరి నిమిషంలో చేసిన గోల్‌తో యూరో చాంపియన్‌షి్‌పలో నెదర్లాండ్స్‌ శుభారంభం అందుకుంది. గ్రూప్‌ ‘డి’లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-1తో పోలెండ్‌ను ఓడించింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వౌట్‌ 83వ నిమిషంలో..నాథన్‌ అకే నుంచి అందుకున్న పాస్‌ను గోల్‌పోస్టులోకి కొట్టడంతో డచ్‌ అభిమానులు సంబరాల్లో మునిగారు. అంతకుముందు.. గాయంతో స్టార్‌ ఆటగాడు రాబర్ట్‌ లెవాన్‌డొస్కీ లేకుండా బరిలో దిగిన పోలెండ్‌ 16వ నిమిషంలో ఆడమ్‌ బుస్కా చేసిన గోల్‌తో ఆధిక్యం ప్రదర్శించింది. అయితే 29వ నిమిషంలో గ్యాప్కో కొట్టిన గోల్‌తో నెదర్లాండ్స్‌ సమం చేసింది. గ్రూప్‌ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 2-1తో అల్బేనియాపై విజయం సాధించింది. గ్రూప్‌ ‘సి’లో స్లోవేనియా, డెన్మార్క్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

Updated Date - Jun 17 , 2024 | 04:46 AM