Share News

రౌఫ్‌ పునరాగమనం

ABN , Publish Date - May 25 , 2024 | 05:38 AM

గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌కు వరల్డ్‌ కప్‌ పాకిస్థాన్‌ జట్టులో చోటు కల్పించారు. శుక్రవారం ప్రకటించిన 15 మంది జట్టుకు స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఫిబ్రవరిలో జరిగిన

రౌఫ్‌ పునరాగమనం

వరల్డ్‌ కప్‌ పాకిస్థాన్‌ జట్టు

కరాచీ: గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌కు వరల్డ్‌ కప్‌ పాకిస్థాన్‌ జట్టులో చోటు కల్పించారు. శుక్రవారం ప్రకటించిన 15 మంది జట్టుకు స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఫిబ్రవరిలో జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో భుజం గాయానికి లోనైన రౌఫ్‌ పునరాగమనంతో పాక్‌పేస్‌ బౌలింగ్‌ బలపడనుంది. అబ్రార్‌ అహ్మద్‌, ఆజమ్‌ ఖాన్‌, అబ్బాస్‌ అప్రీది, సాయిమ్‌ అయూబ్‌, ఉస్మాన్‌ ఖాన్‌ తొలిసారి ప్రపంచ కప్‌ ఆడనున్నారు.

పాకిస్థాన్‌ జట్టు: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), అబ్రార్‌, ఆజమ్‌ ఖాన్‌, ఫఖర్‌ జమాన్‌, హారిస్‌ రౌఫ్‌, ఇఫ్తికార్‌, ఇమాద్‌ వసీమ్‌, అబ్బాస్‌ అప్రీది, ఆమెర్‌, రిజ్వాన్‌, నసీమ్‌ షా, అయూబ్‌, షాదాబ్‌ ఖాన్‌. షహీన్‌ షా, ఉస్మాన్‌ ఖాన్‌.

Updated Date - May 25 , 2024 | 05:38 AM