Share News

World Boxing : అభినాశ్‌, నిశాంత్‌ ముందంజ

ABN , Publish Date - May 27 , 2024 | 04:30 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్వహిస్తున్న వరల్డ్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు పోటీల్లోనూ భారత బాక్సర్లు అభినాశ్‌ జమ్వాల్‌, నిషాంత్‌ దేవ్‌

World Boxing : అభినాశ్‌, నిశాంత్‌ ముందంజ

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్వహిస్తున్న వరల్డ్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు పోటీల్లోనూ భారత బాక్సర్లు అభినాశ్‌ జమ్వాల్‌, నిషాంత్‌ దేవ్‌ విజయాలు నమోదు చేశారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం ముగిసిన 63.5 కిలోల రెండో బౌట్‌లో అభినాశ్‌ 5-0తో ఆండ్రీజస్‌ లావ్రెనోవాస్‌ (లిథువేనియా)ను చిత్తు చేయగా, నిషాంత్‌ 71 కిలోల బౌట్‌లో 5-0తో అర్మాండో బిగాఫా (గినియా బిస్సావు)పె ౖనెగ్గి ముందంజ వేశారు. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో సచిన్‌ శివాచ్‌ (57 కి.), అభిమన్యు (80 కి.) తొలి రౌండ్‌లో విజయం సాధించగా, అమిత్‌ పంఘల్‌ (51 కి.) సంజిత్‌ (92 కి.) నరీందర్‌ (92 ప్లస్‌ కి.), మహిళల్లో జాస్మిన్‌ (57 కి.), అరుంధతి చౌధురి (66 కి.)కి తొలి రౌండ్‌లో బై లభించాయి. సోమవారం అనుక్షిత (60 కి.), అభిమన్యు (80 కి.) రెండో రౌండ్‌లో తలపడనున్నారు. ఇక, భారత్‌కు ఆసియా క్రీడల ద్వారా మూడు ఒలింపిక్‌ బెర్త్‌లు లభించడం తెలిసిందే.

Updated Date - May 27 , 2024 | 04:30 AM