నన్నెందుకు బ్లాక్ చేశారో..?
ABN , Publish Date - May 08 , 2024 | 03:56 AM
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే, ఆ తర్వాత ఫ్రాంచైజీతో అతడి సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో....
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే, ఆ తర్వాత ఫ్రాంచైజీతో అతడి సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి వార్నర్‌ను తప్పించిన ఫ్రాంచైజీ.. క్రమంగా అతడిని జట్టుకు కూడా దూరం చేసింది. ప్రస్తుతం వార్నర్ ఢిల్లీకి ఆడుతున్నాడు. అయితే, సన్‌రైజర్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేయడం తనను ఎంతో బాధించిందని ఓ యూట్యూబ్ చానెల్లో అశ్విన్‌తో జరిగిన చిట్‌చాట్‌లో వార్నర్ వాపోయాడు. అలా ఎందుకు చేశారో తనకు అర్థం కాలేదన్నాడు. కానీ, జట్టు అభిమానులు మాత్రం సోషల్ మీడియా ద్వారా తనతో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉండ డం సంతోషంగా ఉందని వార్నర్ చెప్పాడు.