Share News

నిలిచేదెవరు.. నిష్క్రమించేదెవరు?

ABN , Publish Date - May 22 , 2024 | 01:44 AM

నిష్క్రమించే దశ నుంచి సంచలన ప్రదర్శనతో నాకౌట్‌ చేరింది ఒకరైతే.. ఆరంభంలో అదరగొట్టి ఆఖర్లో డీలాపడిన వాళ్లు మరొ కరు. ఐపీఎల్‌లో భిన్న ప్రదర్శనలతో ప్లేఆ్‌ఫ్సకు చేరుకొన్న రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు....

నిలిచేదెవరు.. నిష్క్రమించేదెవరు?

ఎలిమినేటర్‌ పోరు నేడే

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

  • జోరుమీదున్న బెంగళూరు

  • ఒత్తిడిలో రాజస్థాన్‌

అహ్మదాబాద్‌: నిష్క్రమించే దశ నుంచి సంచలన ప్రదర్శనతో నాకౌట్‌ చేరింది ఒకరైతే.. ఆరంభంలో అదరగొట్టి ఆఖర్లో డీలాపడిన వాళ్లు మరొ కరు. ఐపీఎల్‌లో భిన్న ప్రదర్శనలతో ప్లేఆ్‌ఫ్సకు చేరుకొన్న రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు.. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌ బెర్త్‌ కోసం క్వాలిఫయర్‌-2 ఆడనుండగా.. ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్లనుంది. వరుసగా 7 మ్యాచ్‌లు ఓడి నాకౌట్‌ ఆశలు దాదాపుగా ముగిసిన తరుణంలో.. బెంగళూరు అద్భుత ప్రదర్శ నతో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ఔరా అని పించిం ది. డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నైతో చావోరేవో మ్యాచ్‌లో సూపర్‌షోతో అలరించి ప్లేఆఫ్స్‌ చేరిన డుప్లెసి సేన.. ఎలిమినేటర్‌కు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కోహ్లీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తుండగా.. డుప్లెసి, పటీదార్‌, గ్రీన్‌, దినేష్‌ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో యశ్‌ దయాళ్‌ కీలకంగా మారాడు.


ఒక్కసారిగా గతితప్పి: తొలి 9 మ్యాచ్‌ల్లో 8 గెలిచి జోరుమీదున్న రాజస్థాన్‌.. చివర్లో గతితప్పింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన తీరు జట్టులోని లోపాలను బహిర్గతం చేశాయి. ఆఖరి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో.. మొత్తం 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్‌కు సిద్ధమైంది. కాగా, లీగ్‌ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయి. బట్లర్‌ ఇంగ్లండ్‌ వెళ్లడంతో ఆర్‌ఆర్‌ బ్యాటింగ్‌లో దూకుడు లోపించింది. కెప్టెన్‌ శాంసన్‌, పరాగ్‌ ఈ సీజన్‌లో ఎక్కువగా జట్టు భారాన్ని మోయగా.. జైస్వాల్‌ నిలకడలేమితో ఇబ్బందులు పడుతున్నాడు. గాయపడిన హెట్‌మయర్‌ రాకతో లోయరార్డర్‌ బ్యాటింగ్‌ కొంత బలపడింది. బౌల్ట్‌, సందీప్‌ శర్మ, చాహల్‌లతో జట్టు బౌలింగ్‌ మెరుగ్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ బౌలింగ్‌కు.. బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య ప్రధాన పోటీ నడిచే అవకాశం ఉంది.

Updated Date - May 22 , 2024 | 01:44 AM