Share News

ఎవరో.. కొత్త చాంప్‌?

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:01 AM

మూడు మాసాలు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 తుది అంకానికి చేరుకొంది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో పుణెరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది...

ఎవరో.. కొత్త చాంప్‌?

ప్రొ కబడ్డీ ఫైనల్లో హరియాణాతో పుణె ఢీ నేడు

రాత్రి 8 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో..

హైదరాబాద్‌: మూడు మాసాలు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 తుది అంకానికి చేరుకొంది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో పుణెరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. సీజన్‌ ఆసాంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పుణె.. సెమీ్‌సలో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఆల్‌రౌండర్లు అస్లం ఇనామ్‌దార్‌, పంకజ్‌ మోహిత్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 2023 ఫైనల్లో జైపూర్‌ చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచిన పల్టన్‌.. ఈసారి టైటిల్‌ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్లేఆ్‌ఫ్సకు చేరుకొన్న హరియాణా తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసిన స్టీలర్స్‌.. సెమీ్‌సలో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు షాకిచ్చింది. ఇరుజట్లూ ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గకపోవడంతో.. ఏ టీమ్‌ గెలిచినా కొత్త చాంపియన్‌ ఆవిర్భవించడం ఖాయం.

Updated Date - Mar 01 , 2024 | 06:01 AM