Share News

వారెవా..దీప్తి

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:05 AM

చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో యూపీ వారియర్స్‌ అదరగొట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో భాగంగా శుక్రవారం అత్యంత ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో యూపీ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

వారెవా..దీప్తి

ఆల్‌రౌండ్‌ షోతో అదుర్స్‌

ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు

ఢిల్లీపై పరుగు తేడాతో యూపీ గెలుపు

న్యూఢిల్లీ: చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో యూపీ వారియర్స్‌ అదరగొట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో భాగంగా శుక్రవారం అత్యంత ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో యూపీ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 139 పరుగుల స్వల్ప ఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ జట్టులో కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (60) మినహా అంతా విఫలమయ్యారు. జెమీమా 17, షఫాలీ 15, క్యాప్సీ 15 రన్స్‌ చేశారు. యూపీ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ధాటికి ఢిల్లీ చివరి రెండు ఓవర్లలో ఏకంగా ఆరు వికెట్లు సమర్పించుకుంది. 19వ ఓవర్‌లో దీప్తి 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసింది ఇక, ఆఖరి ఓవర్‌ చివరి నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన దశలో ఢిల్లీ మిగతా మూడు వికెట్లు కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకుంది. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ (4/19) హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హ్యారిస్‌, సైమా ఠాకూర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 రన్స్‌ చేసింది. దీప్తి శర్మ (59) అర్ధ సెంచరీతో సత్తా చాటగా, కెప్టెన్‌ అలిసా హీలీ (29) ఫర్వాలేదనిపించింది. ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ తీసిన తొలి ప్లేయర్‌గా దీప్తి రికార్డుకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌ దీప్తి. గతేడాది ఇస్సీ వాంగ్‌ (ముంబై తరఫున) తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఇక ఈ టోర్నీలో అతి తక్కువ స్కోరును కాపాడుకున్న తొలి జట్టుగా యూపీ నిలిచింది.

చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో యూపీ వారియర్స్‌ అదరగొట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో భాగంగా శుక్రవారం అత్యంత ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో యూపీ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

యూపీ: 20 ఓవర్లలో 138/8 (దీప్తి 59, హీలీ 29, రాధా 2/16, టిటాస్‌ 2/23).

ఢిల్లీ: 19.5 ఓవర్లలో 137 ఆలౌట్‌ (లానింగ్‌ 60, దీప్తి 4/19, హ్యారిస్‌ 2/8, సైమా 2/13).

Updated Date - Mar 09 , 2024 | 03:05 AM