Share News

పారా క్రీడల్లో తెలుగోళ్ల సత్తా

ABN , Publish Date - Jan 12 , 2024 | 02:03 AM

జాతీయ పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో ముగ్గురు తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించారు. గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ముగిసిన హైజంప్‌ టి-44 కేటగిరీ పోటీల్లో...

పారా క్రీడల్లో తెలుగోళ్ల సత్తా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో ముగ్గురు తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించారు. గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ముగిసిన హైజంప్‌ టి-44 కేటగిరీ పోటీల్లో ఐ.శ్యామ్‌ (గుంటూరు) రజతం సొంతం చేసుకున్నాడు. పోలియో బాధితుడైన శ్యామ్‌ 170 సెంటీమీటర్ల ఎత్తు దూకి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అనంతపురానికి చెందిన అంధ క్రీడాకారిణి ఎన్‌.పల్లవి షాట్‌పుట్‌లో రజతంతో మెరిసింది. పల్లవి ఇనుప గుండును 6.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ పారా స్ర్పింటర్‌ మోహన్‌ హర్ష 100 మీటర్ల పరుగును 11.25 సెకన్లలో పూర్తి చేసి, కాంస్యం సాధించాడు.

Updated Date - Jan 12 , 2024 | 02:03 AM