Share News

సెమీస్‌లో వెస్టిండీస్‌

ABN , Publish Date - Oct 16 , 2024 | 05:15 AM

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ నెగ్గిన వెస్టిండీస్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నాకౌట్‌ అయ్యింది. గ్రూపులో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ తలా ఆరేసి పాయింట్లతో నిలిచాయి...

సెమీస్‌లో వెస్టిండీస్‌

ఎవరితో ఎవరు

ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా (గురువారం)

వెస్టిండీస్‌ X న్యూజిలాండ్‌ (శుక్రవారం)

  • ఆఖరి లీగ్‌లో ఓడిన ఇంగ్లండ్‌ అవుట్‌

  • దక్షిణాఫ్రికా ముందంజ

  • వరల్డ్‌కప్‌

దుబాయ్‌: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ నెగ్గిన వెస్టిండీస్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నాకౌట్‌ అయ్యింది. గ్రూపులో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ తలా ఆరేసి పాయింట్లతో నిలిచాయి. అయితే అత్యుత్తమ రన్‌రేట్‌తో విండీస్‌ అమ్మాయిలు (+1.504) అగ్రస్థానం కైవసం చేసుకోగా, సఫారీలు (+1.382) రెండో స్థానంలో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌ (+1.117) మూడో స్థానంతో వైదొలగింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత 141/7 స్కోరు చేసింది. స్కివర్‌ బ్రెంట్‌ (57)తో సత్తా చాటింది. ఫ్లెచర్‌ మూడు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో వెస్టిండీస్‌ 18 ఓవర్లలో 144/4 స్కోరు చేసి నెగ్గింది. క్వియానా (52), హేలీ మాథ్యూస్‌ (50) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు.

Updated Date - Oct 16 , 2024 | 05:15 AM