Share News

విరాట్‌ నన్ను బ్లాక్‌ చేశాడు..

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:35 AM

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. విరాట్‌ కోహ్లీ మధ్య చక్కటి స్నేహబంధం ఉంది. ఐపీఎల్‌లో ఇద్దరూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడే విషయం తెలిసిందే....

విరాట్‌ నన్ను బ్లాక్‌ చేశాడు..

మెల్‌బోర్న్‌: గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. విరాట్‌ కోహ్లీ మధ్య చక్కటి స్నేహబంధం ఉంది. ఐపీఎల్‌లో ఇద్దరూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడే విషయం తెలిసిందే. అయితే గతంలో వీరి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. ఓసారైతే సోషల్‌ మీడియాలో మ్యాక్సీని విరాట్‌ బ్లాక్‌ కూడా చేశాడట. ఇన్‌స్టాలో కోహ్లీని ఫాలో అవుదామనుకున్నప్పుడు తనను బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందని మాక్సీ చెప్పాడు. భారత్‌లో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో విరాట్‌ రాంచీ టెస్టులో భుజం నొప్పితో బాధపడ్డాడు. ఆ సమయంలో విరాట్‌ ఏం చేశాడో.. దాన్నే అనుకరిస్తూ మ్యాక్స్‌ తన కుడి భుజంపై చేయి వేస్తూ నొప్పిని భరిస్తున్నట్టు నటించాడు. ఆ కోపంతో కోహ్లీ బ్లాక్‌ చేశాడట.

Updated Date - Oct 30 , 2024 | 04:35 AM