Virat Kohli : విరాట్ మళ్లీ తండ్రయ్యాడు
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:55 AM
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య అనుష్క శర్మ ఈనెల 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన ఈ సమాచారాన్ని స్వయంగా విరుష్క దంపతులు మంగళవారం
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య అనుష్క శర్మ ఈనెల 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన ఈ సమాచారాన్ని స్వయంగా విరుష్క దంపతులు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమ చిన్నారికి అకాయ్ అనే పేరు పెట్టినట్టు చెప్పారు. 2017లో వివాహం చేసుకున్న కోహ్లీ, అనుష్కకు 2021లో కూతురు వామికా జన్మించిన సంగతి తెలిసిందే. ‘మా జీవితంలో మధుర క్షణాలివి. ఈ సంతోషకర సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. వామికాకు సోదరుడు పుట్టాడని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అలాగే మా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని తమ పోస్టులో పేర్కొన్నారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ దంపతులు ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ కారణంతోనే ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు విరాట్ దూరమయ్యాడని తెలుస్తోంది.