Share News

వెర్‌స్టాపెన్‌ వరుసగా నాలుగోసారి

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:23 AM

రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మార్క్‌ వెర్‌స్టాపెన్‌ చరిత్ర సృష్టించాడు. వరుసగా నాలుగోసారి ప్రతిష్ఠాత్మక ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ దక్కించుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన లాస్‌వెగాస్‌ గ్రాండ్‌ప్రీ రేస్‌లో...

వెర్‌స్టాపెన్‌ వరుసగా నాలుగోసారి

ఫార్ములావన్‌ చాంపియన్‌షి్‌ప కైవసం

లాస్‌వెగాస్‌: రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మార్క్‌ వెర్‌స్టాపెన్‌ చరిత్ర సృష్టించాడు. వరుసగా నాలుగోసారి ప్రతిష్ఠాత్మక ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ దక్కించుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన లాస్‌వెగాస్‌ గ్రాండ్‌ప్రీ రేస్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన 27 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ ఐదో స్థానంలో నిలిచినా..అప్పటికే 393 పాయింట్లతో సమీప ప్రత్యర్థి రస్సెల్‌ కంటే 62 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచాడు. దాంతో చాంపియన్‌షి్‌ప అతని సొంతమైంది. కాగా ఈ చాంపియన్‌షిప్‌ను షూమాకర్‌, హామిల్టన్‌ 7 సార్లు, మాన్యువల్‌ 5 సార్లు, ప్రాస్ట్‌, వెటెల్‌ నాలుగేసి సార్లు కైవసం చేసుకున్నారు. ఇక లాస్‌వెగాస్‌లో..మెర్సిడెస్‌ డ్రైవర్లు జార్జ్‌ రస్సెల్‌, హామిల్టన్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

Updated Date - Nov 25 , 2024 | 02:23 AM