28 బంతుల్లో సెంచరీ
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:37 AM
ఐపీఎల్ వేలంలో ఏ జట్టుకూ పట్టని ఆటగాడిగా మిగిలిన గుజరాత్ వికెట్ కీపర్/బ్యాటర్ ఉర్విల్ పటేల్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్స్‌లతో 113 నాటౌట్) టీ20ల్లో రెండో వేగవంతమైన శతకం...

టీ20ల్లో ఉర్విల్ పటేల్ రికార్డు
ఇండోర్: ఐపీఎల్ వేలంలో ఏ జట్టుకూ పట్టని ఆటగాడిగా మిగిలిన గుజరాత్ వికెట్ కీపర్/బ్యాటర్ ఉర్విల్ పటేల్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్స్‌లతో 113 నాటౌట్) టీ20ల్లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బుధవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పటేల్ కేవలం 28 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో 2018లో ఇదే టోర్నీలో హిమాచల్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషభ్ పంత్ 32 బంతుల్లో శతకం రికార్డును పటేల్ అధిగమించాడు. కాగా, ఓవరాల్‌గా పొట్టి క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డు ఎస్తోనియా బ్యాటర్ సాహిల్ చౌహాన్ (27 బంతులు) పేరిట ఉంది. పటేల్ వీరవిహారంతో.. 155/8 స్కోరును గుజరాత్ 10.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.