యూపీ యోధాస్ బోణీ
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:19 AM
యూపీ యోధాస్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యోధాస్ 28-23 స్కోరుతో దబాంగ్ ఢిల్లీపై...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): యూపీ యోధాస్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యోధాస్ 28-23 స్కోరుతో దబాంగ్ ఢిల్లీపై గెలిచింది. ఇరు జట్ల డిఫెండర్లు అద్భుతంగా ఆడడంతో పాయింట్లు సాధించడానికి రైడర్లు చెమటోడ్చారు. యూపీ రైడర్లు భవానీ రాజ్‌పుత్ (7 పాయింట్లు), సురేందర్ గిల్ (4) గెలుపులో ముఖ్యభూమిక పోషించారు. ఢిల్లీ కెప్టెన్, స్టార్ రైడర్ అషు మాలిక్ 15 రైడ్లలో నాలుగే పాయింట్లు సాధించడం ఆ జట్టు అవకాశాలను సన్నగిల్లేలా చేసింది. ఢిల్లీ రైడర్లు అషు, నవీన్, మోహిత్, ఆశీ్‌షను యూపీ డిఫెండర్లు అద్భుతంగా ట్యాకిల్ చేయడంతో ఆ జట్టు ఆలౌటైంది. ఇదే సమయంలో యూపీ రైడర్లు భవానీ, నితిన్ వరుస పాయింట్లు తేవడంతో ఆ జట్టును విజయం వరించింది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 40-25 స్కోరు తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించింది.