Share News

ఎనిమిదేళ్ల దిగువకు..

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:19 AM

పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్‌ కోహ్లీ టెస్టు సగటు ఎనిమిదేళ్ల దిగువకు చేరింది. పెర్త్‌ టెస్టులో సెంచరీ చేశాక అతడు 7, 11, 3 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో...

ఎనిమిదేళ్ల దిగువకు..

పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్‌ కోహ్లీ టెస్టు సగటు ఎనిమిదేళ్ల దిగువకు చేరింది. పెర్త్‌ టెస్టులో సెంచరీ చేశాక అతడు 7, 11, 3 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో తన టెస్టు సగటు 47.49కి పడిపోయింది. 2016 తర్వాత విరాట్‌ ఇంత తక్కువ సగటుకి చేరడం ఇదే ప్రథమం. మరోవైపు విరాట్‌ అవుటైన తీరును మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ తప్పుబట్టాడు. ‘పేలవ షాట్‌తో తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఒకవేళ ఆ బంతి నాలుగో స్టంప్‌పై పడితే అర్థం చేసుకోగలం. కానీ ఏడు లేదా ఎనిమిదో స్టంప్‌పై పడిన బంతిని ఆడాల్సిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నించాడు.

Updated Date - Dec 17 , 2024 | 06:19 AM