Share News

ఉమా మళ్లీ కొట్టాడు

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:19 AM

తెలుగు షూటర్‌ మద్దినేని ఉమామహేష్‌ ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో రెండో పతకం సాధించాడు. బుధవారం జరిగిన జూనియర్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఉమా త్రయం...

ఉమా మళ్లీ కొట్టాడు

ఆసియా షూటింగ్‌ టీమ్‌

ఈవెంట్‌లో రజతం

జకర్తా: తెలుగు షూటర్‌ మద్దినేని ఉమామహేష్‌ ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో రెండో పతకం సాధించాడు. బుధవారం జరిగిన జూనియర్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఉమా త్రయం రజతంతో మెరిసింది. ఉమా (630.5 పాయింట్లు), అభివన్‌ షా (627.9), పార్ధ్‌ రాకేష్‌ (626.8) బృందం 1885.2 స్కోరుతో ద్వితీయ స్థానంలో నిలవగా, చైనా బృందం ఒక పాయింట్‌ తేడాతో స్వర్ణం ఎగరేసుకుపోయింది. సీనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో యువ షూటర్‌ నాన్సీ 252.8 స్కోరుతో స్వర్ణం, ఒలింపియన్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ 252.7 స్కోరుతో రజతం కొల్లగొట్టారు. 10 మీ, ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో నాన్సీ, వలరివన్‌, మెహులీ ఘోష్‌ త్రయం పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీ, ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌ కాంస్యం నెగ్గాడు. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ కేటగిరీలో రుద్రాంక్ష్‌, అర్జున్‌, శ్రీకార్తిక్‌ జోడీ కాంస్యం దక్కించుకుంది. జూనియర్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అభినవ్‌ రజతం, పార్థ్‌ కాంస్య పతకాలతో మెరిశారు.

Updated Date - Jan 11 , 2024 | 03:19 AM