T20 World Cup : ఉగాండా థ్రిల్లింగ్ విన్
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:53 AM
టీ20 వరల్డ్‌క్‌పలో ఉగాండా తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో గురువారం జరిగిన థ్రిల్లింగ్ ఫైట్‌లో ఉగాండా 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినీ (పీఎన్‌జీ)పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన

3 వికెట్లతో పపువాపై గెలుపు
ఎన్‌సుబుగా రికార్డు ఫీట్
నేటి మ్యాచ్
కెనడా X ఐర్లాండ్ (రా.8. గం.)
ప్రొవిడెన్స్ (గయానా): టీ20 వరల్డ్‌క్‌పలో ఉగాండా తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో గురువారం జరిగిన థ్రిల్లింగ్ ఫైట్‌లో ఉగాండా 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినీ (పీఎన్‌జీ)పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పీఎన్‌జీ 19.1 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. హిరి హిరి (15), లెగా స్లకా (12), కిప్లిన్ డోంగా (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకొన్నారు. రంజాని, కీవుటా, మియాగి తలో రెండు వికెట్లు పడగొట్టారు. కానీ, 43 ఏళ్ల స్పిన్నర్ ఫ్రాంక్ ఎన్‌సుబుగా (4-2-4-2) పొట్టి కప్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో ఉగాండా 18.2 ఓవర్లలో 78/7 స్కోరు చేసి గెలిచింది. రియాజత్ అలీ (33) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలీ నవో, నార్మన్ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు.