Share News

ఐసీసీ అండర్‌-19జట్టులో ఉదయ్‌, సచిన్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:24 AM

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. సోమవారం ప్రకటించిన టీమ్‌ ఆఫ్‌ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌, సచిన్‌ దాస్‌తోపాటు...

ఐసీసీ అండర్‌-19జట్టులో ఉదయ్‌, సచిన్‌

బెనోని (సౌతాఫ్రికా): ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. సోమవారం ప్రకటించిన టీమ్‌ ఆఫ్‌ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌, సచిన్‌ దాస్‌తోపాటు ముషీర్‌ ఖాన్‌, స్పిన్నర్‌ సౌమీ పాండేలు స్థానం సంపాదిం చారు. ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ హగ్‌ వీబ్జెన్‌ను ఐసీసీ ప్యానెల్‌ ఈ టీమ్‌కు కూడా సారథిగా ఎంపిక చేసింది. టోర్నీలో అదరగొట్టిన సౌతాఫ్రికా పేసర్‌ క్వెనా మఫాకాకు కూడా చోటు లభించింది.

Updated Date - Feb 13 , 2024 | 05:25 AM