Share News

హైదరాబాద్‌, వైజాగ్‌లో రెండేసి మ్యాచ్‌లు

ABN , Publish Date - Feb 23 , 2024 | 02:57 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తారా? లేక విదేశాలకు తరలిస్తారా? అనే సస్పెన్స్‌కు తెరపడింది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మెగా లీగ్‌ షెడ్యూల్‌ను....

హైదరాబాద్‌, వైజాగ్‌లో రెండేసి మ్యాచ్‌లు

మార్చి 22 నుంచి ఐపీఎల్‌

  • ఫ ఆరంభ మ్యాచ్‌లో చెన్నైతో బెంగళూరు ఢీ

  • ఫ తొలి 17 రోజుల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తారా? లేక విదేశాలకు తరలిస్తారా? అనే సస్పెన్స్‌కు తెరపడింది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మెగా లీగ్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. అయితే, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాక్షికంగా అంటే.. తొలి 17 రోజులకు (మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7 వరకు) సంబంధించిన మ్యాచ్‌ల తేదీలను మాత్రమే ప్రకటించింది. అయితే, ఫైనల్‌ మే 26న నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ తేదీలను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం, పోలీసులతో సమన్వయం చేసుకొని రెండో దశ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు బీసీసీఐ తెలిపింది. వచ్చే నెల 22న చెన్నైలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే)తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ప్రకటిత షెడ్యూల్‌లో 10 నగరాల్లో జరిగే 21 మ్యాచుల్లో ప్రతి జట్టూ 3 నుంచి 5 మ్యాచ్‌లు ఆడనుంది. 2009లో పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఎడిషన్‌ను యూఏఈలో ఆడించారు. అయితే, 2019లో ఎన్నికలు జరిగినా భారత్‌ నుంచి తరలించలేదు. తొలి వారాంతంలో జరిగే డబుల్‌ హెడర్‌లో పంజాబ్‌తో ఢిల్లీ, కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. కాగా, తొలి దశలో జరిగే రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నంను ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తమ హోంగ్రౌండ్‌గా ఎంపిక చేసుకొంది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం పిచ్‌ కొంత పాడయ్యే అవకాశం ఉండడంతో క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. దీంతో సాగర తీరం వైౖజాగ్‌లో మార్చి 31న చెన్నైతో, ఏప్రిల్‌ 3న కోల్‌కతాతో ఢిల్లీ ఆడనుంది. సన్‌రైజర్స్‌ ఉప్పల్‌ వేదికగా మార్చి 27న ముంబై, ఏప్రిల్‌ 5న సీఎ్‌సకేతో తలపడనుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుండగా.. తమ గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో రెండేసిసార్లు తలపడనుంది. మరో గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌, ఐదో టీమ్‌తో రెండుసార్లు ఆడనుంది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యా పగ్గాలు చేపట్టడం ఈ సీజన్‌ విశేషం. ఇక, గత సీజన్‌లో చెన్నైను విజేతగా నిలిపిన ధోనీ.. ఏడాది తర్వాత మళ్లీ అభిమానుల ముందుకు రానున్నాడు.

ఐపీఎల్‌ తొలి విడత షెడ్యూల్‌

తేదీ మ్యాచ్‌ వేదిక సమయం

మార్చి 22 చెన్నై గీబెంగళూరు చెన్నై రా. 8

మార్చి 23 పంజాబ్‌ గీఢిల్లీ మొహాలి మ. 3.30

మార్చి 23 కోల్‌కతా గీహైదరాబాద్‌ కోల్‌కతా రా. 7.30

మార్చి 24 రాజస్థాన్‌ గీలఖ్‌నవూ జైపూర్‌ మ. 3.30

మార్చి 24 గుజరాత్‌ గీ ముంబై అహ్మదాబాద్‌ రా. 7.30

మార్చి 25 బెంగళూరుగీపంజాబ్‌ బెంగళూరు రా. 7.30

మార్చి 26 చెన్నై గీ గుజరాత్‌ చెన్నై రా. 7.30

మార్చి 27 హైదరాబాద్‌ గీ ముంబై హైదరాబాద్‌ రా. 7.30

మార్చి 28 రాజస్థాన్‌ గీ ఢిల్లీ జైపూర్‌ రా. 7.30

మార్చి 29 బెంగళూరు గీకోల్‌కతా బెంగళూరు రా. 7.30

మార్చి 30 లఖ్‌నవూ గీ పంజాబ్‌ లఖ్‌నవూ రా. 7.30

మార్చి 31 గుజరాత్‌ గీహైదరాబాద్‌ అహ్మదాబాద్‌ మ. 3.30

మార్చి 31 ఢిల్లీ గీ చెన్నై విశాఖపట్నం రా. 7.30

ఏప్రిల్‌ 1 ముంబై గీ రాజస్థాన్‌ ముంబై రా. 7.30

ఏప్రిల్‌ 2 బెంగళూరు గీలఖ్‌నవూ బెంగళూరు రా. 7.30

ఏప్రిల్‌ 3 ఢిల్లీ గీ కోల్‌కతా విశాఖపట్నం రా. 7.30

ఏప్రిల్‌ 4 గుజరాత్‌ గీ పంజాబ్‌ అహ్మదాబాద్‌ రా. 7.30

ఏప్రిల్‌ 5 హైదరాబాద్‌ గీ చెన్నై హైదరాబాద్‌ రా. 7.30

ఏప్రిల్‌ 6 రాజస్థాన్‌ గీ బెంగళూరు జైపూర్‌ రా. 7.30

ఏప్రిల్‌ 7 ముంబై గీ ఢిల్లీ ముంబై రా. 3.30

ఏప్రిల్‌ 7 లఖ్‌నవూ గీ గుజరాత్‌ లఖ్‌నవూ రా. 7.30

Updated Date - Feb 23 , 2024 | 02:57 AM