Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

తుషార్‌, శార్దూల్‌ కూల్చేశారు

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:46 AM

పేసర్లు తుషార్‌ దేశ్‌పాండే (3/24), శార్దూల్‌ ఠాకూర్‌ (2/48) విజృంభించడంతో.. ముంబైతో శనివారం ఆరంభమైన రంజీ సెమీ్‌సలో తమిళనాడు తడబడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో

తుషార్‌, శార్దూల్‌ కూల్చేశారు

తమిళనాడు 146 ఆలౌట్‌

ముంబై 45/2

రంజీ సెమీస్‌

ముంబై: పేసర్లు తుషార్‌ దేశ్‌పాండే (3/24), శార్దూల్‌ ఠాకూర్‌ (2/48) విజృంభించడంతో.. ముంబైతో శనివారం ఆరంభమైన రంజీ సెమీ్‌సలో తమిళనాడు తడబడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌ బ్యాటర్లు సాయి సుదర్శన్‌ (0), నారాయణ్‌ జగదీశన్‌ (4), ప్రదోష్‌ రంజన్‌ పాల్‌ (8), కెప్టెన్‌ సాయి కిషోర్‌ (1) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. 17/4తో పీకల్లోతు కష్టాల్లోపడ్డ తమిళనాడును విజయ్‌ శంకర్‌ (44), వాషింగ్టన్‌ సుందర్‌ (43) ఆరో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఇక శంకర్‌ అవుట్‌తో తమిళనాడు పతనం వేగంగా జరిగిపోయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ముంబై తొలిరోజు ఆట ముగిసేసరికి 45/2 స్కోరు చేసింది. ముషీర్‌ ఖాన్‌ (24), మోహిత్‌ అవస్థీ (1) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు పృథ్వీ షా (5), భూపేన్‌ లాల్వాణి (15) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు.

Updated Date - Mar 03 , 2024 | 04:46 AM