Share News

హాకీలో క్వార్టర్స్‌కు

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:16 AM

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ఫైవ్స్‌ పురుషుల వరల్డ్‌ కప్‌లో భారత్‌ క్వార్టర్‌ పైనల్‌కు దూసుకెళ్లింది...

హాకీలో క్వార్టర్స్‌కు

ఎఫ్‌ఐహెచ్‌ ఫైవ్స్‌ వరల్డ్‌కప్‌

మస్కట్‌: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ఫైవ్స్‌ పురుషుల వరల్డ్‌ కప్‌లో భారత్‌ క్వార్టర్‌ పైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తమ గ్రూప్‌-బిలోని ఆఖరి, మూడో మ్యాచ్‌లో భారత్‌ 13-0 గోల్స్‌ తేడాతో జమైకాపై భారీ విజయాన్ని సాధించింది. మణిందర్‌ సింగ్‌ 4 గోల్స్‌తో చెలరేగగా, మన్‌జీత్‌, రహీల్‌ మన్‌దీప్‌ మోర్‌ తలా రెండు గోల్స్‌తో అదరగొట్టారు.

Updated Date - Jan 30 , 2024 | 03:16 AM