Share News

ఈ కప్పులో ఇతడే పెద్దోడు

ABN , Publish Date - May 07 , 2024 | 02:17 AM

ఉగాండా జట్టు ఆఫ్‌ స్పిన్నర్‌ ఫ్రాంక్‌ ఎన్‌సుబుగా (43 ఏళ్ల 252 రోజులు) ఈ వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న అతిపెద్ద వయస్సు క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు...

ఈ కప్పులో ఇతడే పెద్దోడు

కంపాల (ఉగాండా): ఉగాండా జట్టు ఆఫ్‌ స్పిన్నర్‌ ఫ్రాంక్‌ ఎన్‌సుబుగా (43 ఏళ్ల 252 రోజులు) ఈ వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న అతిపెద్ద వయస్సు క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ఇక బ్రయాన్‌ మసాబా సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టును ఉగాండా బోర్డు సోమవారం ప్రకటించింది. కాగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ తదితర జట్లతో కలిసి ఉగాండా టీమ్‌ గ్రూప్‌-సిలో ఉంది.

Updated Date - May 07 , 2024 | 02:17 AM