అదే నా ఆఖరి టెస్ట్
ABN , Publish Date - May 12 , 2024 | 02:10 AM
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది...

ఇంగ్లండ్ పేసర్ అండర్సన్
లండన్: ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఆ మ్యాచే తనకు చివరిదని 41 ఏళ్ల అండర్సన్ శనివారం వెల్లడించాడు. ‘ఈ వేసవిలో లార్డ్స్‌లో విండీ్‌సతో జరిగే టెస్టే నాకు ఆఖరిది’ అని ఇన్‌స్టాలో అతడు ప్రకటించాడు. ‘20 ఏళ్లపాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. బాల్యం నుంచే నాకు క్రికెట్ అంటే ఆసక్తి. ఇంగ్లండ్ జట్టును వీడనుండడం బాధాకరమే. కానీ నాలాగే ఇతర ఆటగాళ్లకు కూడా తమ కలను నెరవేర్చుకొనే అవకాశం ఇవ్వాలి’ అని అండర్సన్ పేర్కొన్నాడు. 2003లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అండర్సన్ 187 టెస్ట్‌ల్లో 700 వికెట్లు పడగొట్టాడు.