పోరాడి ఓడిన తెలుగు యోధాస్
ABN , Publish Date - Jan 12 , 2024 | 02:05 AM
అల్టిమేట్ ఖో-ఖో లీగ్ సెమీఫైనల్లో చెన్నై క్విక్ గన్స్ చేతిలో తెలుగు యోధాస్ జట్టు ఓటమి పాలైంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒడిశా జగర్‌నాట్స్‌కు షాకిచ్చిన గుజరాత్ జెయింట్స్ ఫైనల్ చేరింది...

అల్టిమేట్ ఖో-ఖో లీగ్ ఫైనల్లో చెన్నై, గుజరాత్
కటక్: అల్టిమేట్ ఖో-ఖో లీగ్ సెమీఫైనల్లో చెన్నై క్విక్ గన్స్ చేతిలో తెలుగు యోధాస్ జట్టు ఓటమి పాలైంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒడిశా జగర్‌నాట్స్‌కు షాకిచ్చిన గుజరాత్ జెయింట్స్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్ పోరులో చెన్నై క్విక్ గన్స్‌పై ఆట ప్రారంభం నుంచి దాదాపుగా చివరి వరకు తెలుగు యోధా్‌సదే పైచేయిగా సాగింది. అయితే చివరి నాలుగు నిమిషాల్లో యోధాస్ ఆధిక్యం 26-24కు తగ్గింది. ఆఖరి రెండు నిమిషాల్లో చెన్నై ప్లేయర్ రాంజీ మ్యాజిక్‌తో ఆ జట్టు 31-29తో విజయం సాధించింది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో గుజరాత్ జెయింట్స్ 29-27తో ఒడిశాపై నెగ్గింది. ఇక, శనివారం జరిగే మెగా ఫైనల్లో గుజరాత్ జెయింట్స్‌తో చెన్నై క్విక్ గన్స్, మూడో స్థానం పోరులో ఒడిశాతో యోధాస్ తలపడనుంది.