Telugu Titans : టైటాన్స్‌ను గెలిపించిన పవన్
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:11 AM
కెప్టెన్ పవన్ సెహ్రావత్ చెలరేగడంతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 48-36తో పుణెరి పల్టన్‌పై గెలిచింది
పుణె: కెప్టెన్ పవన్ సెహ్రావత్ చెలరేగడంతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 48-36తో పుణెరి పల్టన్‌పై గెలిచింది. టైటాన్స్ సారథి పవన్ సెహ్రావత్ 15 పాయింట్లు సాధించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి మ్యాచ్‌లో గెలిచిన టైటాన్స్‌కు ప్లేఆఫ్స్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. మిగతా మ్యాచ్‌ల గెలుపోటములపై టైటాన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక, మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 31-28తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గి ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.