Share News

విజయంలో తెలుగమ్మాయి

ABN , Publish Date - May 07 , 2024 | 02:16 AM

రిలేలో భారత్‌కు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ అందించిన క్రీడాకారిణల బృందంలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కూడా సభ్యురాలు. జ్యోతిక స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తణుకు...

విజయంలో తెలుగమ్మాయి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రిలేలో భారత్‌కు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ అందించిన క్రీడాకారిణల బృందంలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కూడా సభ్యురాలు. జ్యోతిక స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తణుకు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన జ్యోతిక తండ్రి శ్రీనివాసరావు ఇనుప బీరువాలు తయారు చేసి, కుటుంబాన్ని పోషిస్తాడు. తల్లి లక్ష్మీనాగ వెంకటేశ్వరి గృహిణి. శ్రీనివాసరావుకు క్రీడలపై ఉన్న ఆసక్తితో జ్యోతికను ఐదేళ్ల వయస్సు నుంచి ఆ దిశగా నడిపించాడు. 2021 వరకు విజయవాడ ‘సాయ్‌’ కేంద్రంలో శిక్షణ తీసుకున్న జ్యోతిక, అక్కడి కోచ్‌ వినయ్‌ సహకారంతో హైదరాబాద్‌ సాయ్‌ సెంటర్‌కు మారింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ గత రెండేళ్లగా జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న జ్యోతిక, అనతి కాలంలోనే ఒలింపిక్స్‌ స్థాయికి చేరడం విశేషం.

Updated Date - May 07 , 2024 | 02:16 AM