Share News

ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు: రవిశాస్త్రి

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:56 AM

ఏడాదిన్నర క్రితం వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలియగానే కన్నీటిని ఆపుకోలేకపోయానని మాజీ కోచ్‌

ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు: రవిశాస్త్రి

న్యూయార్క్‌: ఏడాదిన్నర క్రితం వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలియగానే కన్నీటిని ఆపుకోలేకపోయానని మాజీ కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. పాక్‌తో మ్యాచ్‌లో పంత్‌ బ్యాటింగ్‌లోనే కాకుండా, మూడు క్యాచ్‌లతో ఆకట్టుకోవడంతో జట్టు నుంచి బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు అందుకున్నాడు. దీన్ని అందించేందుకు రవిశాస్త్రి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాడు. ‘కెరీర్‌ సందేహాస్పదంగా మారిన స్థితి నుంచి పంత్‌ ఈ మెగా టోర్నీ ఆడే దశకు చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం. బ్యాటింగ్‌లో జట్టు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా ఉండడమే కాకుండా, కీపింగ్‌ సమయంలోనూ వేగంగా కదలడం చూస్తుంటే నీ కఠోర శ్రమ అర్థమవుతుంది’ అని శాస్త్రి కొనియాడాడు.

Updated Date - Jun 11 , 2024 | 04:56 AM