Share News

T20 World Cup : ‘టాప్‌’లో స్కాట్లాండ్‌

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:05 AM

మైకేల్‌ లీస్క్‌ (35; 1/16) ఆల్‌రౌండ్‌షోతో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉన్న ఈ జట్టు గ్రూప్‌

T20 World Cup : ‘టాప్‌’లో స్కాట్లాండ్‌

నమీబియాపై గెలుపు

మైకేల్‌ ఆల్‌రౌండ్‌ షో

టీ20 వరల్డ్‌ కప్‌

నేటి మ్యాచ్‌లు

న్యూజిలాండ్‌ X అఫ్ఘానిస్థాన్‌ (ఉ.5. గం.)

శ్రీలంక X బంగ్లాదేశ్‌ (ఉ.6. గం.)

నెదర్లాండ్స్‌ X దక్షిణాఫ్రికా (రాత్రి 8 గం.)

ఆస్ట్రేలియా X ఇంగ్లండ్‌ (రాత్రి 10.30 గం.)

బ్రిడ్జిటౌన్‌: మైకేల్‌ లీస్క్‌ (35; 1/16) ఆల్‌రౌండ్‌షోతో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉన్న ఈ జట్టు గ్రూప్‌ ‘బి’లో టాప్‌నకు చేరింది. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దు కావడంతో చెరో పాయింట్‌ను కేటాయించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (52) అర్ధసెంచరీతో ఆదుకోగా, గ్రీన్‌ (28), డేవిన్‌ (20) ఫర్వాలేదనిపించారు. పేసర్‌ బ్రాడ్‌ వీల్‌కు మూడు, బ్రాడ్లీ కర్రీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో స్కాట్లాండ్‌ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసి నెగ్గింది. ఎరాస్మస్‌కు రెండు వికెట్లు దక్కాయి. నమీబియా బౌలర్లు ఆరంభంలో కట్టడి చేయడంతో బ్యాటర్లు రన్స్‌ కోసం ఇబ్బందిపడ్డారు. అయితే కెప్టెన్‌ బెరింగ్టన్‌ (47 నాటౌట్‌)కు లీస్క్‌ జత కలవడంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా లీస్క్‌ నాలుగు సిక్సర్లతో చెలరేగి 18వ ఓవర్‌లో అవుటయ్యాడు. అప్పటికి ఐదో వికెట్‌కు 74 పరుగులు జత చేరడంతో జట్టు విజయం ఖాయమైంది.

సంక్షిప్త స్కోర్లు: నమీబియా: 20 ఓవర్లలో 155/9 (ఎరాస్మస్‌ 52, గ్రీన్‌ 28, డేవిన్‌ 20; వీల్‌ 3/33, కర్రీ 2/16); స్కాట్లాండ్‌: 18.3 ఓవర్లలో 157/5 (బెరింగ్టన్‌ 47 నాటౌట్‌, లీస్క్‌ 35, జోన్స్‌ 26; ఎరాస్మస్‌ 2/29).

Updated Date - Jun 08 , 2024 | 06:05 AM