ఐదేసిన ఫరూఖీ
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:12 AM
టీ20 వరల్డ్‌కప్‌ను అఫ్ఘానిస్థాన్ ఘన విజయంతో ఆరంభించింది. రహ్మనుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) అర్ధ శతకాలతోపాటు పేసర్ ఫజల్‌హక్ ఫరూఖీ (5/9) ఐదు వికెట్లతో విజృంభించడంతో..
అఫ్ఘానిస్థాన్ శుభారంభం
125 పరుగులతో ఉగాండా చిత్తు
ప్రొవిడెన్స్ (గయానా): టీ20 వరల్డ్‌కప్‌ను అఫ్ఘానిస్థాన్ ఘన విజయంతో ఆరంభించింది. రహ్మనుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) అర్ధ శతకాలతోపాటు పేసర్ ఫజల్‌హక్ ఫరూఖీ (5/9) ఐదు వికెట్లతో విజృంభించడంతో.. గ్రూప్-సిలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘాన్ 125 పరుగుల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. తొలుత అప్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. కాస్మాస్, మసాబా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఉగాండా 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ ఒబుయా (14), రియాజత్ అలీ షా (11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. రషీద్, నవీనుల్ చెరో 2 వికెట్లు తీశారు.