ఫైనల్లో న్యూజిలాండ్
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:46 AM
పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్ మహిళలు టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరారు. శుక్రవారం ఉత్కంఠగా జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8
వెస్టిండీస్ ఓటమి
దక్షిణాఫ్రికాతో తుదిపోరు రేపు
షార్జా: పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్ మహిళలు టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరారు. శుక్రవారం ఉత్కంఠగా జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగులతో వెస్టిండీస్‌ను ఓడించింది. తొలుత కివీస్ 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. జార్జ్ ఫ్లిమ్మర్ (33), సుజీ బేట్స్ (26), ఇసబెల్లా గేజ్ (20) సత్తా చాటారు. డాటిన్ 4, ఫ్లెచర్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 120/8 స్కోరుకే పరిమితమైంది. బౌలింగ్‌లో అదరగొట్టిన డాటిన్ (33) మెరుపు బ్యాటింగ్‌తో పోరాడింది. కానీ 17వ ఓవర్లో డాటిన్ అవుటవడంతో మ్యాచ్ కివీస్‌వైపు మొగ్గింది. ఆపై ఫ్లెచర్ (17 నాటౌట్), జైడా (14) విండీస్‌ను గెలిపించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. కార్సన్ 3, కెర్ 2 వికెట్లు తీశారు. ఇక.. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
సంక్షిప్తస్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 128/9 (ప్లిమ్మెర్ 33, బేట్స్ 26, ఇసబెల్లా 20 నాటౌట్, డోటిన్ 4/22, అలీ ఫ్లెచర్ 2/22).
వెస్టిండీస్: 20 ఓవర్లలో 120/8 (డాటిన్ 33, ఫ్లెచర్ 17 నాటౌట్, జైడా 14, కార్సన్ 3/29, కెర్ 2/14).