Share News

Australian Open : స్వియటెక్‌ అవుట్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:10 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో శనివారం పెను సంచలనం నమోదైంది. మహిళల వరల్డ్‌ నెంబర్‌వన్‌, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత

Australian Open : స్వియటెక్‌ అవుట్‌

టీనేజర్‌ లిండా నొస్కోవా సంచలనం

నాలుగో రౌండ్‌కు అల్కారజ్‌, మెద్వెదెవ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో శనివారం పెను సంచలనం నమోదైంది. మహిళల వరల్డ్‌ నెంబర్‌వన్‌, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఇగా స్వియటెక్‌కు మూడో రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. ఈ వేదికపై తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న స్వియటెక్‌ (పోలెండ్‌) 6-3, 3-6, 4-6తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజర్‌ లిండా నొస్కోవా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌డ్రాలో ఆడడం లిండాకిదే తొలిసారి. మిగిలిన మ్యాచుల్లో అజరెంకా 6-1, 7-5తో ఒస్తపెంకోపై, స్విటోలినా 6-2, 6-3తో గోలుబిక్‌పై, పావోలిని 7-6, 6-4తో బ్లింకోవాపై, కలిన్‌స్కాయా 6-7, 6-1, 6-4తో స్లోన్‌ స్టీఫెన్స్‌పై నెగ్గి నాలుగోరౌండ్‌ చేరారు.

అల్కారజ్‌, మెద్వెదెవ్‌ ముందుకు..: పురుషుల సింగిల్స్‌లో టాప్‌ స్టార్లు అల్కాజర్‌, డానిల్‌ మెద్వెదెవ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ స్థాయికి తగ్గ ఆటతీరుతో నాలుగో రౌండ్‌కు చేరారు. మూడో రౌండ్‌లో రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) 6-1, 6-1, 1-0తో జున్‌చెంగ్‌ (చైనా)పై వాకోవర్‌తో గెలిచాడు. అలాగే రష్యా స్టార్‌ మెద్వెదెవ్‌ 6-3, 6-4, 6-3 తేడాతో అగర్‌ అలియాసిమ్‌ (కెనడా)పై, ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-2, 7-6, 6-2తో మికెల్సెన్‌ (అమెరికా)పై, అన్‌సీడెడ్‌ బోర్గెస్‌ (పోర్చుగల్‌) 6-7, 6-4, 6-2, 7-6తో దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై, కామెరూన్‌ నోరీ (ఇంగ్లండ్‌) 6-4, 6-7, 6-4, 6-3తో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై, ఆర్థర్‌ కజాక్స్‌ () 6-3, 6-3, 6-1తో గ్రీక్స్‌పూర్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్రీరామ్‌ బాలాజీ-విక్టర్‌ కార్నియా (రొమేనియా) రెండో రౌండ్‌లో 3-6, 3-6తో ఎరెవలో(ఎల్‌సాల్వెడార్‌)-పావిక్‌ (క్రొయేషియా)చేతిలో ఓడారు.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

Updated Date - Jan 21 , 2024 | 05:10 AM