స్వియటెక్ సులువుగా.. యూఎస్ ఓపెన్
ABN , Publish Date - Sep 04 , 2024 | 02:47 AM
యూఎస్ ఓపెన్‌లో టాప్‌సీడ్లు జోరుమీదున్నారు. టాప్‌సీడ్లు జానెక్ సినర్, ఇగా స్వియటెక్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. జొకోవిచ్, అల్కారజ్ నిష్క్రమణతో టైటిల్‌పై అంచనాలున్న వరల్డ్ నెంబర్‌వన్ సినర్ ప్రీక్వార్టర్స్...
యూఎస్ ఓపెన్
క్వార్టర్స్‌కు ఇగా, సినర్
మెద్వెదెవ్, అలెక్స్ కూడా
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్‌సీడ్లు జోరుమీదున్నారు. టాప్‌సీడ్లు జానెక్ సినర్, ఇగా స్వియటెక్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. జొకోవిచ్, అల్కారజ్ నిష్క్రమణతో టైటిల్‌పై అంచనాలున్న వరల్డ్ నెంబర్‌వన్ సినర్ ప్రీక్వార్టర్స్ దాటేందుకు తీవ్రంగా చెమటోడ్చాడు. 14వ సీడ్ టామీ పాల్‌తో జరిగిన పోరులో తొలిరెండు సెట్లను టైబ్రేకర్‌లో గెలుచుకున్న సినర్ చివరకు 7-6 (7/3), 7-6 (7/5), 6-1తో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. సెమీస్ బెర్త్ కోసం మాజీ విజేత డానిల్ మెద్వెదెవ్‌తో సినర్ అమీతుమీ తేల్చుకుంటాడు. 5వ సీడ్ మెద్వెదెవ్ 6-0, 6-1, 6-3తో నూనో బోర్జ్‌సను త్తుచేశాడు. మరో మ్యాచ్‌లో 10వ సీడ్ అలెక్స్ డి మినార్ 6-0, 3-6, 6-3, 7-5తో జోర్డాన్ థాంప్సన్‌పై గెలిచాడు. ఇక, ఆరో గ్రాండ్‌స్లామ్ వేటలోనున్న నెంబర్‌వన్ క్రీడాకారిణి స్వియటెక్ 6-4, 6-1తో 16వ సీడ్ లూడ్మిలా సామ్‌సనోవాను సులువుగా ఓడించి 6వ సీడ్ జెస్సికా పెగులాతో క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది.
మరో ప్రీక్వార్టర్స్‌లో 22వ సీడ్ బెర్టెజ్ హద్దాద్ మియా 6-2, 3-6, 6-3తో వెటరన్ స్టార్ వోజ్నియాకిపై గెలిచింది.
మిక్స్‌డ్ సెమీ్‌సకు బోపన్న: పురుషుల డబుల్స్‌లో నిష్క్రమించిన రోహన్ బోపన్న, మిక్స్‌డ్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. 8వ సీడ్ బోపన్న-సుజియాది (ఇండోనేసియా) ద్వయం 7-6(4), 2-6, 10-7తో 4వ సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)-క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీని ఓడించింది. సెమీ్‌సలో అమెరికా జంట డొనాల్డ్ యంగ్-టేలర్ టౌన్‌సెండ్‌తో బోపన్న జోడీ తలపడనుంది.