Share News

స్వియటెక్‌.. హ్యాట్రిక్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:29 AM

టాప్‌సీడ్‌ ఇగా స్వియటెక్‌ సాధించింది..వరుసగా మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కిరీటం సొంతం చేసుకుంది. ఈక్రమంలో అనేక రికార్డులు అందుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఏకపక్ష ఫైనల్లో 23 ఏళ్ల స్వియటెక్‌ 6-2, 6-1తో...

స్వియటెక్‌.. హ్యాట్రిక్‌

పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు

అల్కారజ్‌ X జ్వెరెవ్‌, సా. 6.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

  • పోలెండ్‌ స్టార్‌దే ఫ్రెంచ్‌ ఓపెన్‌

  • ఫైనల్లో పౌలినీ చిత్తు

స్వియటెక్‌కు రూ. 21.65 కోట్లు

పౌలినీకి రూ. 10.82 కోట్లు

పారిస్‌: టాప్‌సీడ్‌ ఇగా స్వియటెక్‌ సాధించింది..వరుసగా మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కిరీటం సొంతం చేసుకుంది. ఈక్రమంలో అనేక రికార్డులు అందుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఏకపక్ష ఫైనల్లో 23 ఏళ్ల స్వియటెక్‌ 6-2, 6-1తో 12వ సీడ్‌ జాస్మిన్‌ పౌలినీ (ఇటలీ)ని చిత్తు చేసింది. గంటా ఎనిమిది నిమిషాలు సాగిన తుది సమరం..తొలి సెట్‌లో ఓ దశలో స్వియటెక్‌ 1-2తో వెనుకంజలో నిలిచింది. ఆపై వరుసగా 10 గేములు గెలిచి మొదటి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌లోనైతే స్వియటెక్‌ ధాటికి పౌలినీ పూర్తిగా చేతులెత్తేసింది. ఏకంగా 5-0తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన పోలెండ్‌ స్టార్‌..ఆ సెట్‌ను మరింత సులువుగా ముగించడంతోపాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మ్యాచ్‌లో స్వియటెక్‌, జాస్మిన్‌ చెరో ఏస్‌ కొట్టగా..తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన 28 ఏళ్ల పౌలినీ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.


స్వియటెక్‌ 18 విన్నర్లు కొడితే..పౌలినీ ఏడింటికే పరిమితమైంది. స్వియటెక్‌కు రొలాండ్‌ గారో్‌సలో ఇది వరుసగా 21వ విజయం. ఇక.. జస్టిన్‌ హెనిన్‌ (2005, 06, 07)) తర్వాత హ్యాట్రిక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు అందుకున్న తొలి క్రీడాకారిణిగా స్వియటెక్‌ రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలో ఇగాకు ఇది నాలుగో ఫ్రెంచ్‌ ఓపెన్‌. అంతకుముందు ఆమె తొలిసారిగా 2020లో ఇక్కడ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా స్వియటెక్‌కు ఇది ఐదో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2022లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచింది. ఇక, గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్‌ చేరిన ప్రతిసారీ స్వియటెక్‌ విజేతగా నిలవడం విశేషం.

Updated Date - Jun 09 , 2024 | 04:29 AM