సదర్లాండ్ రికార్డు ‘డబుల్’
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:51 AM
మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల అనబెల్ సదర్లాండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణా ఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆమె అత్యంత వేగం (248 బంతుల్లో)గా
పెర్త్: మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల అనబెల్ సదర్లాండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణా ఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆమె అత్యంత వేగం (248 బంతుల్లో)గా డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. గతంలో ఆసీస్‌కే చెందిన కారెన్ రోల్టన్ (306 బాల్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. మొత్తంగా అనబెల్ 210 పరుగులు సాధించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 575/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 67/3 స్కోరుతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 76 రన్స్‌కే కుప్పకూలింది.