Share News

ఆదుకున్న స్టొయినిస్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:52 AM

మార్కస్‌ స్టొయినిస్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించాడు. దీంతో గ్రూప్‌ ‘బి’లో చివరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో...

ఆదుకున్న స్టొయినిస్‌

ఆసీస్‌ విజయం.. పోరాడిన స్కాట్లాండ్‌

గ్రాస్‌ ఐలెట్‌ (సెయింట్‌ లూసియా): మార్కస్‌ స్టొయినిస్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించాడు. దీంతో గ్రూప్‌ ‘బి’లో చివరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గట్టెక్కింది. ఈ ఓటమితో స్కాట్లాండ్‌ నిష్క్రమించింది. ముందుగా స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మెక్‌ములెన్‌ (60), బెరింగ్టన్‌ (42 నాటౌట్‌), మున్సే (35) ధాటిగా ఆడారు. మ్యాక్స్‌వెల్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో ఆసీస్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 రన్స్‌ చేసి గెలిచింది. 13 ఓవర్ల వరకు మ్యాచ్‌ స్కాట్లాండ్‌ ఆధీనంలోనే ఉన్నా ఆ తర్వాత ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టొయినిస్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఒత్తిడి తొలిగిపోయింది. హెడ్‌ (68), డేవిడ్‌ (24 నాటౌట్‌) రాణించారు. వాట్‌, షరీ్‌ఫలకు రెండేసి వికెట్లు దక్కాయి.


పాయింట్ల పట్టిక గ్రూప్‌-బి

జట్టు మ్యా గె ఓ ఫ.తే పా రన్‌రేట్‌

ఆస్ట్రేలియా 4 4 0 0 8 2.791

ఇంగ్లండ్‌ 4 2 1 1 5 3.611

స్కాట్లాండ్‌ 4 2 1 1 5 1.255

నమీబియా 4 1 3 0 2 -2.585

ఒమన్‌ 4 0 4 0 0 -3.062

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; పా: పాయింట్లు

Updated Date - Jun 17 , 2024 | 04:52 AM