Share News

SRH vs CSK - IPL 2024: రాణించిన సన్‌రైజర్స్ బౌలర్స్.. మోస్తరు స్కోరుకే చెన్నై కట్టడి

ABN , Publish Date - Apr 05 , 2024 | 09:23 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి రాణించారు. సొంత మైదానం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మంచి దూకుడు మీద చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 5 వికెట్లు నష్టపోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. 45 పరుగులు చేసిన శివమ్ దూబే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

SRH vs CSK - IPL 2024: రాణించిన సన్‌రైజర్స్ బౌలర్స్.. మోస్తరు స్కోరుకే చెన్నై కట్టడి

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి రాణించారు. సొంత మైదానం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మంచి దూకుడు మీద చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 5 వికెట్లు నష్టపోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. 45 పరుగులు చేసిన శివమ్ దూబే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వేగంగా ఆడేందుకు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పైనే అతడు 24 బంతుల్లో 45 పరుగులు కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమ్మిన్స్, షాబాద్ అహ్మద్, జయ్‌దేవ్ ఉనడ్కత్ తలో వికెట్ తీశారు.

చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంత్ర (12), రుతురాజ్ గైక్వాడ్ (26), అజింక్యా రహానే (35), శివమ్ దూబే (45), రవీంద్ర జడేజా (31 నాటౌట్), డారిల్ మిచెల్ (13), ఎంఎస్ ధోనీ (1 నాటౌట్) చొప్పున వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీలింగ్ ఎంచుకుంది.

Updated Date - Apr 05 , 2024 | 09:31 PM